లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా నిజానికి ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ మరి కొన్ని కారణాలవల్ల అప్పుడు కూడా రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని ప్రకటించారు. ఆయితే తాజా సమాచారం ప్రకారం ఇది వాయిదా పడినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 19కి మారుస్తున్నారట మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ రానున్నారు.