లవ్ స్టోరీ షూటింగ్ ప్రారంభం..శేఖర్ కమ్ముల రూల్స్

నాగచైతన్య హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల తాజగా తెరకెక్కిస్తోన్న మూవీ లవ్ స్టోరీ. ఈ మూవీలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. కరోనావైరస్ వల్ల కొన్ని నెలల పాటు నిలిచిపోయిన చిత్రీకరణ మళ్లీ ప్రారంభం అయింది. దీని సంబంధించి ప్రముఖ ఫిలిం క్రిటిక్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేసి సమాచారం అందించారు.

ఆరు నెలల గ్యాప్ తరువాత హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభం అయినట్టు తెలిపారు. ఈ మూవీని నారాయణ్ దాస్ కే నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ తెరకెక్కిస్తున్నారు. ఇది నాగచైతన్య 19వ చిత్రం.ఇక షూటింగ్ విషయంలో శేఖర్ కమ్ముల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోవిడ్-19 బారినుండి టీమ్ ను దూరంగా ఉంచడానికి కొన్ని నియమాలు సెట్ చేశారు. ఆ నియమాలు..

  • కేవలం 15 మంది షూటింగ్ క్రూ మాత్రమే ఉంటారు.
  • షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఎవరూ లొకేషన్ నుంచి బయటకు వెళ్లకూడదు.
  • సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్క్ ధరించడం తప్పనిసరి.
  •  సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ పూర్తి చేయాలి.
  •  ప్రభుత్వ నియమాలు పాటించాలి.