నెట్‌ఫ్లిక్స్‌లో ఉప్పెన.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. వంద కోట్ల గ్రాస్‌ను ఇప్పటి వరకు ఈ చిత్రం సాధించిందని చిత్రనిర్మాతలు పేర్కోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించగా, విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించాడు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఉప్పెన ఈనెల 24న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీంతో మరోసారి ఈ సినిమాను మరోసారి మోబైల్స్‌లో చూడోచ్చిని మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.