ఎం.వి. నారాయణను పరామర్శించిన అళహరి సుధాకర్

  • కావలి వాస్తవ్యులు అడ్వకేట్, సీనియర్ రాజకీయ నాయకులు ఎం.వి. నారాయణ ను ఒంగోలు హాస్పెటల్ వెళ్లి చూసిన… అళహరి సుధాకర్

కావలి నియోజకవర్గం: అడ్వకేట్, కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా పోటీ చేసిన సీనియర్ రాజకీయ వేత్త ఎం.వి. నారాయణ గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఈ మధ్యనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సీరియస్ అయిందని విషయంతెలుసుకున్న కావలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ అళహరి సుధాకర్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఒంగోలు లోని వారి కుమార్తె హాస్పిటల్ కు వెళ్లి చూడటము జరిగింది. వారి శ్రీమతి చెప్పిన ప్రకారం రెండు రోజుల నుండి కళ్ళు తెరిచి చూస్తున్నారని, ప్రస్తుతం డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఉన్నారని తెలిపారని అళహరి సుధాకర్ చెప్పారు. వారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. నారాయణ గారు నాకు అత్యంత ఆప్తులు అని, వారు వారి అబ్బాయి రవి గారు ప్రజారాజ్యం పార్టీ తరుపున కావలి ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తున్న సమయములో హైదరబాద్ లోని నా షోరూంలోనే ఎక్కువ సమయము గడిపేవారని గుర్తుచేసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్డిస్తున్నానని తెలిపారు.