మడకశిర జనసేన పార్టీ మండల కమిటీ ఎన్నిక

మడకశిర: జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలోని మండలాల కమిటీల నియామకం ఏవిధంగా పూర్తి చేయాలో జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ సూచనల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శి రాపా ధనుంజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్ అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా.. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మడకశిర నియోజకవర్గం జనసేన పార్టీ మండల కమిటీ ఎన్నికలో మండల అధ్యక్షుడిగా టి శివాజీ, ఉపాధ్యక్షుడిగా యశ్వంత్, ప్రసాద్, ప్రధాన కార్యదర్శలు కార్యదర్శిలు సంయుక్త కార్యదర్శిలతో కలిపి 22 మందిని మండల కమిటీలో ఎన్నుకోవడం జరిగింది.