సోమప్ప సర్కిల్లో పవన్ కళ్యాణ్ ఫోటో కి పాలాభిషేకం

ఎమ్మిగనూరు, డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక రైతులతో భేటి అయ్యి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ నెల 12 న అనంతపురం లో రైతు భరోసా యాత్రని గౌరవనీయులు పవన్ కళ్యాణ్ ప్రారంభించి 30 మంది రైతు కుటుంబాలకు ఆర్థికసహయం అందించారు. అది తెలుసుకున్న కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు స్థానిక రైతులు జనసేన నాయకులు చల్లా వరుణ్ ని కలిసి మా రైతుల అందరి తరపున పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియచేయండి అని కోరడం జరిగింది. అంతేకాకుండా వారి అభిమానాన్ని చాటుకొనే దిశగా స్థానిక సోమప్ప సర్కిల్లో పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రి పట్టించుకోలేదు కానీ ఓడిపోయినా సరే తమపట్ల ఎంతో ఔదార్యం చూపిన పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎప్పటికి కృతజ్ఞులై ఉంటామని తమకోసం నిలబడిన జనసేన పార్టీ గెలుపు కోసం మేమంతా కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియచేశారు. ఎమ్మిగనూరు జనసేన నేత చల్లా వరుణ్ మాట్లాడుతూ… వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మన రాష్ట్రంలో ఏ వర్గం వారు సంతృప్తిగా ఉన్న సంధర్భం లేదు. అందరికీ అన్నం పెట్టే రైతన్న పరిస్థితి అయితే మరీ ఘోరం కౌలు రైతులకు అందించాల్సిన ఫలాలు అందించడం లో పూర్తి వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం పంటకు సరైన మద్దతు ధర కల్పించడంలోనూ, తూఫాన్ లాంటి విపత్తుల సంధర్భంలోనూ రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా 3000 పైగా కౌలు రైతులు మరణిస్తే కేవలం అతి తక్కువ మందికి మాత్రమే నష్టపరిహారం అందించింది. అది కూడా కులాల ప్రాతిపదికగా మాత్రమే అన్నం పెట్టే రైతన్న మరణిస్తే అందులో కులం చూడటం అనేది ఈ ప్రభుత్వానికి మాత్రమే చెల్లింది. ఏ అధికారం లేకపోయినా అన్నం పెట్టే రైతన్న కుటుంబాన్ని ఎంతో కొంత ఆదుకునే దిశగా జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర ని ప్రారంభించింది. ఈ యాత్ర కోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 5 కోట్ల రూపాయలను ఫండ్ గా ఇచ్చారు. అప్పులు భరించలేక అర్దాంతరంగా తనువులు చాలించిన రైతుల కుటుంబాలు పరామర్శించి కౌలు రైతు మరణించిన ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, నందవరం నాయకులు, గోనెగండ్ల నాయకులు, ఫణి, ప్రసాద్, మహారాజ్, హరీష్, మల్లి, నవీన్, నాసిర్, మహబూబ్, అక్బర్, మున్నా తదితరులు పాల్గొన్నారు.