వినుత కోటాను కలిసిన మదనపల్లె జనసేన నాయకులు

చిందేపల్లె గ్రామ రహదారిని ఈసీఎల్ ఫ్యాక్టరీ యాజమాన్యం అడ్డంగా గోడ కట్టడంపై మూడు రోజులు ఆమరణ దీక్ష చేసిన శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జి వినుత కోటా దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో వినుత కోటకి అండగా మదనపల్లి నియోజకవర్గం నుంచి మీకు ఎప్పుడూ అండగా ఉంటాం అంటూ వారికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, హరి ప్రసాద్, గోపాలకృష్ణ, అరుణ, కిరణ్ కుమార్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, మరియు జనసైనికులు దైర్యం చెప్పడం జరిగింది.