30 సంవత్సరాలకు సరిపడా ఇసుకను దోచేసిన అధికార ప్రభుత్వం: గాదె

  • ప్రకృతి ప్రసాదించిన నదులలో దొరికే ఇసుకను 30 సంవత్సరాలకు సరిపడా ఇసుకను దోచేసిన అధికార ప్రభుత్వం

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం బొమ్మూవరపాలెం గ్రామంలో ఉన్న ఇసుక రీచ్ లో జరుగుతున్న అక్రమ త్రవ్వకాలను ఆపి ఇసుక రీచ్ ని వెంటనే మూసి వేయాలి అని కలెక్టర్ కి వినతి పత్రం అందించిన గాదె….
*రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఇసుక మాఫియా రెచ్చిపోతుంది..
*జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో వైసిపి అధిక రేట్ కు ఇసుక అమ్ముకుంటుంది.
వాటర్ అండ్ ల్యాండ్ యాక్ట్ కి విరుద్ధంగా నది గర్భంలో జ్చ్బ్ తో ఇసుకను త్రవ్వి అమ్ముకుంటున్నారు..
*మాది పేదల ప్రభుత్వం అని పేపర్ లలో యాడ్స్ ఇచ్చుకునే జగన్ రెడ్డి 475/- అమ్మాల్సిన టన్ను ఇసుక 625/- అమ్ముతున్నారు. అంతే కాకుండా వెనుకబడిన వర్గాలకు కట్టే ఇళ్ళకు మరియు స్కూల్స్ కి నాడు – నేడు పధకాల కింద ఉచిత ఇసుక సరఫరా చేయాలి అని ప్రభుత్వ నిర్ణయం..
*ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఉచితంగా ఇసుక పంపిణి పేరుతో యాదేచ్చగా ఇసుక అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
*అంతే కాకుండా లారీలలో 18టన్నులు మాత్రమే లోడ్ చేయాల్సి ఉండగా 35టన్నుల వరకు లోడ్ చేసుకొని వెళ్తున్నారు.. ధీంతో అసలే గుంతలుగా ఉన్న రోడ్లు మరింత అధ్వాన్నాంగా తయారు అవుతున్నాయి
*స్వాతంత్రం వచ్చిన దగ్గర ఏ ప్రభుత్వం కూడా బొమ్మూవారిపాలెంలో ఇసుక రీచ్ లకు పర్మిషన్ ఇవ్వలేదు.. ఎందుకంటే అక్కడ ఇసుక త్రవ్వితే చుట్టూ పక్కన ఉన్న గ్రామాలు వరద ముంపుకు గురి అయ్యే ప్రమాదం ఉంది..
*కాని వైసిపి ధన దాహం తో పర్మిషన్ ఇచ్చి ముంపు గ్రామాలను ప్రమాదంలో నెట్టారు…
అందువలన సోమవారం ఇసుక రీచ్ ని వెంటనే మూసి వేయాలి అని అలా చేయని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేయాల్సి ఉంటుందని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు ఆధారాలతో సహా గుంటూరు జిల్లా కలెక్టర్ కి తెలియచేసారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ బండారు రవికాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ మోహన్, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మ, దాసరి లక్ష్మి కొల్లిపర మండల అధ్యక్షులు వెంకయ్య, స్థానికులు శ్రీనివాస రెడ్డి, పొన్నూరు టౌన్ అధ్యక్షులు కరీముల్లా, నాగభూషణం, తుమ్మల నరసింహ రావు, గంగరాజు, గోపిశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.