డాక్టర్ కందుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

విశాఖ దక్షిణ నియోజకవర్గం, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో అల్లిపురం నేరెళ్ల కోనేరు జక్షన్ వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 35వ వార్డు దుర్గమ్మ పండుగ పురస్కరించుకొని భవానీల రెండు ఆయిల్ డబ్బాలను వితరణగా అందించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక భక్తులు, ప్రజలు, భవాని మాతలు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహా శివునికి అభిషేక ప్రత్యేక పూజలు తన నివాస వద్ద నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కందుల నళిని, వార్డు ఇన్చార్జి కందుల బద్రీనాథ్, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ కందుల కేదార్నాథ్, మహేశ్వరావు, వివి గుప్త, యజ్ణేశ్వరి, తెలుగు లక్ష్మి, ఆంటోనీ, శ్రవణ్, రాజు, త్రినాధ్, రాజ్ కుమార్, యుద్ధ గిరి గుప్తా, బండారు రమేష్, శ్రీకళ తదితరులు పాల్గొన్నారు.