కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్

మహేష్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా మహేష్ తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన పోస్ట్‌లో రాస్తూ.. నా అభిమాన క్రికెటర్స్ లో ఒకరైన విరాట్ కోహ్లీకు బర్త్ డే శుభాకాంక్షలు. మీరు ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ భారతదేశం గర్వించేలా చేయండి .. రాక్ ఆన్ అంటూ తన ట్వీట్‌ చేశాడు.