మేజర్ ఫస్ట్ లుక్

క్షణం, గూఢచారి వంటి సినిమాల్లో తనదైన నటనతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న అడివి శేష్ ప్రస్తుతం ‘మేజర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరినో కాపాడి, వీర మరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత నేపథ్యంలో ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. అడవి శేష్ బర్త్‌డే సందర్బంగా విడుదలైన పోస్టర్ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రం ఎలా పుట్టింది, ఫస్ట్ లుక్ ఎలా చేసాం అన్నది ఇటీవల ఓ వీడియో ద్వారా తెలియజేశారు అడవి శేష్. గూఢచారి ఫేం శశికిరణ టిక్కా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ గా శోభితా దూళిపాళ్ల నటిస్తుంది.