జనసేన పార్టీ ఆవిర్భావసభను విజయవంతం చేయండి: గంజికుంట రామకృష్ణ

*జనసేనాని నమ్ముకున్న జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యమని నిరూపించిన పంజాబ్ ఎన్నికల ఫలితాలు.
*2024 ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం.
*సభలో జనసేనాని ప్రసంగం గురించి అధికార, ప్రతిపక్షాల నాయకుల్లో జోరుగా చర్చలు.
*సభా ప్రాంగణానికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం.

మార్చి 14 తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ గతంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించలేనంత ఘనంగా నిర్వహించడం జరుగుతోందని, ఈ వేదికగా 2024 ఎన్నికల్లో జనసేన ఏవిధంగా ముందుకు పోవాలో, విధి విధానాలు గురించి జనసేన శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం జరుగుతుందన్న విస్తృత ప్రచారంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయని, సభలో అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతారో అని జనసేన శ్రేణులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యమని ఎప్పటినుండో చెబుతూ 2019 ఎన్నికల్లో ఆచరణలో పెట్టి ఎన్నికలలో పోటీచేయడం జరిగింది. పలితాలు ఆశించినంతగా లేకున్నా ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల ఫలితాల వలన జనసేన పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపింది, జనసేనాని సిద్ధాంతాలు, ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి తొందర్లో అధినాయకుడిని ముఖ్యమంతి చేసుకోవాలనే ధీమాతో కార్యకర్తకు ముందుకు నడవాలని, ఆవిర్భావ సభకు నార్పల మండలం నుండి పెద్దఎత్తున జనసేన పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో నాయకులు తుపాకుల భాస్కర్, లోకేష్, సాకే రాజు, ఆస్వార్థ రెడ్డి, పవన్ కళ్యాణ్, బాబు, పృద్వి, పుల్లయ్య, రాము, ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు.