దేశానికి మూల స్థంభమైన న్యాయ వ్యవస్థ ను తప్పు పట్టే స్థాయికి వైసీపీ వెళ్ళిపోయింది: పవన్ కళ్యాణ్

రేంబో రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి నన్ను పిలిచారు, అలాంటి సమయంలో రాజధాని గురించి నాతో మాట్లాడలేదు. మద్దతిచ్చిన నేనే తెలుగుదేశం మీద తిరగబడ్డా, ఆరోజున మీరెందుకు మాట్లాడలేదు..ఈరోజు మీ ఇష్టానుసారం రాజధాని మారుస్తా అంటే జనసేన ఊరుకోదు. రాజధాని అమరావతి నుండి కదలదు. శాసనాలు చేసే వారు పాటించకపోతే చిన్న పిల్లలు కూడా తిరగబడతారు.

దేశానికి మూల స్థంభాలైన న్యాయ వ్యవస్థ ను వైసీపీ తప్పు పట్టే స్థాయికి వెళ్ళిపోయింది. వ్యవస్థను తిట్టే హక్కు నాకు లేదు, వ్యక్తులను తిట్టే హక్కు ఉందని వైసీపీ వాళ్ళు తెలుసుకోవాలి. హైకోర్టు బ్రాంచ్ ఆఫీస్ గా మారింది అని దిగజారే మాటలు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. క్రిమినల్స్ ను రాజకీయాలు ఎలేలా చేశాం మనం. గుంటూరు కారం తిన్న నాకు పౌరుషం ఉంటాది. పోలీసు వ్యవస్థ ను వైసీపీ నలిపేసింది, వాళ్ళని ఇబ్బందులు పెడుతుంది. పోలీసులకు జీతాలు తగ్గించేశారు, వారాంతపు సెలవు ఇస్తా అని చెప్పి 12 గంటల పని 24 గంటలు చేయిస్తుంది. సీఐ ల కాలర్ ను కూడా వైసీపీ నాయకులు పట్టుకుంటున్నారు, పోలీసులను చొక్కా విప్పి కొడతాం అని బెదిరిస్తున్నారు. ఇదే దెబ్బ పోలీసు అయిన మా తండ్రికి తగిలితే ఎలా కోపం వస్తాదో నాకు ఇప్పుడు అలానే వస్తుంది.