జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి: తులసి ప్రసాద్

చిత్తూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, మంగళవారం మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో సుమారు ఐదు లక్షల మందితో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సభ నుండి ఆత్మహత్య పాల్పడిన 50 మంది కృష్ణా జిల్లా కౌలు రైతుల కుటుంబాలకి ఒక లక్ష రూపాయల చొప్పున సాయం అందించనున్నారు. చిత్తూరు జిల్లా నాయకులు అధినాయకుడు ఆశయాలను ముందుకు నడిపిస్తూ ఆవిర్భావ దినోత్సవంను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా నుండి పార్టీ కోసం పనిచేస్తున్న రాష్ట్ర, జిల్లా విభాగాల నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, లీగల్ సెల్ నాయకులు, ఐటీ భాగాల నాయకులు, వీర మహిళలు, మండల అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని, అలానే ప్రతి నియోజకవర్గంలో నుండి రెండు బస్సులు మరియు మూడు నుండి నాలుగు ఇతర వాహనాల్లో జనసైనికులు సభకు చేరుకుంటారని జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ తెలియజేశారు. ఈ ఆవిర్భావ సభ ద్వారా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ, వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుచరించబోయే రాజకీయ వ్యూహాలను అధినేత తెలియజేయనున్నారని చెప్పారు. పార్టీ అధినేత ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజలకు చేరవేస్తూ ఆయన కోరుకున్న సమాజాన్ని నిర్మించడానికి చిత్తూరు జిల్లా జనసైనికులు అంకితభావంతో పనిచేస్తున్నారని తెలియజేశారు. జిల్లా నుండి అనేకమంది ప్రజలు ఈ సభకు రావాలని, ప్రజల కోసం యుద్ధం చేస్తున్న నాయకుడికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.