జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయండి: యు.పి.రాజు

ఛలో మచిలీపట్నం: మచిలీపట్నం వేదికగా మార్చి 14న తేదిన జరగబోయే దిగ్విజయభేరి జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనీ రాజాం నియోజకవర్గం నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) పిలుపునిచ్చారు. ఈ సభలో రాజాం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొనాలని అన్నారు. యు.పి.రాజు మాట్లాడుతూ ఈ వేదిక నుంచే భవిష్యత్‌ రాష్ట్ర రాజకీయాలకు పవన్‌ కళ్యాణ్ దిశా నిర్దేశం చేస్తారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన లక్ష్యమన్నారు. రాబోయే ఎన్నికలకు జనసైనికులు ఎలా సిద్దం కావాలో పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా దిశా నిర్దేశం చెయ్యనున్నారని, భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే మెరుగైన భవిష్యత్ అందించగలం అనే అంశాలపై జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి ఒక బలమైన సందేశం పంపించేలా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని స్పష్టం చేశారు.