ఈ జీవితం ప్రజా సమస్యలు పరిష్కరానికే అంకితం

  • ముదినేపల్లి మండల జనసేన నాయకులు, కొత్తపల్లి జనసైనికులు

ముదినేపల్లి: నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఎంతో మందికి ముదినేపల్లి మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు అడ్డాగా పేరుగాంచిన కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం నాయకులు, కొత్తపల్లి జనసైనికులు మరోసారి మానవతా దృక్పధంతో మందుకు వచ్చారు. ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటాం అని నిరూపిస్తూ గత వారం రోజుల క్రితం అనేక మధ్యామాల ద్వారా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలోని బంటుమిల్లి మరియు పై ఉన్నా ప్రదేశాలకు వెళ్ళడానికి నిత్యం వేల వాహనాలు నడుస్తూ.. ఎన్నో లక్షల మంది ప్రజలు ప్రయాణిస్తున్న సింగరాయపాలెం – బంటుమిల్లి రహదారి పై నారాయణపురం వరకు రోడ్ పైకి తుమ్మ చెట్లు భారీగా రావడంతో వాహనాలు తప్పుకోవాలి అంటే భయం భయంగా ఉండడంతో తగిన సంబంధిత అధికారులు రోడ్ పైకి వచ్చిన తుమ్మ చెట్లు కొట్టించవలసినదిగా ప్రార్ధించినా స్పందించడకపోవడంతో కొత్తపల్లి జనసైనికులు – ముదినేపల్లి మండలం జనసేన నాయకులకు సమాచారం అందించడంతో ఈరోజు సింగరాయపాలెం నందు కొబ్బరికాయ కొట్టి తదనంతరం పని మొదలై ఉప్పరగూడెం, కొత్తపల్లి, నారాయణపురం ఊరు వరకు సుమారు 7కి. మీ రోడ్ పైకి వచ్చిన తుమ్మ చెట్టులని జేసీబీ సహాయంతో సరిచేయించడం జరిగింది. జనసైనికుల సేవలకు వాహనదారులు ధన్యవాదములు తెలిపారు. తప్పకుండా ఈసారి జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని ప్రజల సమస్యలు వెంటనే పరిస్కారం అవుతాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 6నెలల పైన నుండి ఈ యొక్క రోడ్ కి కనీసం మార్జిన్ కూడా లేకపోవడంతో అనేక వాహనాలు ఢీకొని చాలా మంది మృతి చెందడం మమల్ని తీవ్ర కలిచివేత గురిచేసాయి, అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో తమ సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగుతుంది అని ముదినేపల్లి మండలం నాయకులు, జనసైనికులు తెలిపారు. పని జరుగుతున్న సమయంలో జనసేన జండాలతో జనసైనికులు ప్రజలకు కనిపించడంతో వాహనాదారులు మరియు గ్రామస్థులు వచ్చి మంచి పని చేస్తున్నారని, తాము ఎల్లపుడు పవన్ కళ్యాణ్ గారికి రుణ పడి ఉంటాం అని అనేక ప్రజల నుండి వెల్లువలు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ, పండుగ వేల కూడా తాము కుటుంబంతో కానీ మిత్రులతో కానీ గడపకుండా పండుగకి వచ్చిన ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు అని ఆదివారం ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అని కొత్తపల్లి జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండలం అధ్యక్షులు వీరంకి వెంకయ్య, ఉమ్మడి కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ గారు, కైకలూరు నియోజకవర్గం నాయకులు మోటేపల్లి హనుమాన్ ప్రసాద్, పోకల కృష్ణా, వడ్లని ఆంజనేయులు, ముదినేపల్లి మండలం ఐటీ కోఆర్డినేటర్ సుదాబత్తుల సాయిష్, బొర్రా రవి కిషోర్, బోయిన వాసు, పాశం శ్రీను, మారుబోయిన సాయి, కఠారి భారత్, మాట్లపూడి మదన్, నియోజకవర్గం నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.