వారాహి యాత్రను విజయవంతం చేయండి

  • జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు

పిఠాపురం నియోజవర్గం: రాష్ట్రంలో సీఎం జగన్ రెడ్డి అలంబిస్తున్న అరాచక పాలనపై పోరాడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ రాక్షస పాలన చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం అంతానికి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ భావితరాల భవిష్యత్తు కోసం అక్టోబర్ 1వ తేదీన ఉమ్మడి కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే వారాహి విజయాత్ర బహిరంగ సభకు ఏలూరు నియోజకవర్గం నుంచే కాకుండా ఏలూరు జిల్లా నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలతో పాటు ప్రజలందరూ వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని రెడ్డి అప్పలనాయుడు సూచించారు. దుర్మార్గపు పాలనపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుల గొంతుకలను జగన్మోహన్ రెడ్డి నొక్కుతూ తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టి జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడును జైల్లోకి నెట్టి 20 రోజులు అయినప్పటికీ మళ్లీ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలు, విధ్వంసాలు, అక్రమాలు, అరాచకాల జగన్ రెడ్డి ప్రభుత్వానికి తిలోదకాలు పలికేందుకు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలన్నారు.