వరాహలగెడ్డ రిజ్వాయర్ సందర్శించిన జనసేన నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లా, బుధవారం పార్వతీపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు నష్టపోతున్న రైతులను పరామర్శించి మరియు వరాహలగెడ్డ రిజ్వాయర్ సందర్శించడం జరిగింది. పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగురు మణి మాట్లాడుతూ సకాలంలో వర్షం పడకపోవడం వలన పంట సమృద్ధిగా పండకపోగా, వరిపంట చేతికొచ్చే సమయానికల్లా వర్షాలు లేక పంట దిగుబడి తగ్గి, రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని, అదే విధంగా సుమారుగా 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిర్మించిన వరహాలు గెడ్డ డ్యాం కుడి, ఎడుమ కాలువల మేట వేసిన మరియు గండికొట్టిన సమస్యలు, పరివాహక ప్రాంతంలో కాలువల పూడికలు తీయకపోవడం వలన నీరు డ్యామ్ లో వున్నా పెదమరికి పంచాయతీ, కృష్ణపల్లి పంచాయతీ, ఎల్.ఎన్.పురం పంచాయతీల్లో ఎంతవరకు దోహద పడలేకపోతుంది. కావునా నీటి పారుదులకి సంబందించిన అధికారులు, నాయుకులు చొరవ చూపించి డ్యామ్ కుడి, ఎడమ కాలువలు మరమ్మతులు చేయించి రైతులకి మెరుగైన ఫలితాలు అందేవిధంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాల్సినదిగా జనసేన పార్టీ ఆ గ్రామ రైతులు తరుపున కోరడం జరుగుతుంది. ఒకేవేల సమస్య పరిష్కరించలేని యెడల ఆ రైతులు వెంట జనసేన పార్టీ నిలబడి సమస్య పరిష్కరించేవరకు పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయుకులు బోనేల గోవిందమ్మ, రాజాన బాలు, ఖాతా విశ్వేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరీశంకర్, కర్రీ మణికంఠ, అక్కెన భాస్కర్రావు, ఆగురు శ్రీను, తాతబాబు, మహేష్ ఆ గ్రామ రైతులు జుగున్, హరినాధ, అశోక్, గోవింద, జగన్నాధం, మురళి, కృష్ణపల్లి, పెద్దమరికి గ్రామ జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.