వారహి యాత్రను విజయవంతం చేయండి: డాక్టర్ పిల్లా శ్రీధర్

  • వారహి యాత్ర విజయవంతం చేయాలనీ ప్రజలను చైతన్య పరచిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: దుర్గాడ గ్రామం నందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారహి యాత్రలో భాగంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధి నుండి జూన్ 14న ప్రారంభం కాబోయే వారహి యాత్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే సభను విజయవంతం చేయాలనీ, దుర్గాడ జనసైనికులతో సమావేశం అయిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అనంతరం పోస్టర్ విడుదల చేసి, ప్రజలను చైతన్య పరుస్తూ దుర్గాడ గ్రామంలో పర్యటించారు. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 14న ప్రారంభం కాబోయే వారహి యాత్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే సభ విజయవంతం చేయాలని దుర్గాడ ప్రజల్లో చైతన్యం పెంచుతూ వేలాదిగా తరలి రాలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి వీరబాబు, రావుల, గొల్లపల్లి శివ, వీరబాద్రరావు, కోప్పనా రమేష్, బొజ్జ గోపి కృష్ణ, మరియు జనసైనికులు పాలుగొనడం జరిగింది.