పలు కుటుంబాలను పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం : గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామంలో జనసేన కుటుంబ సభ్యులు ఇటీవల పలువురు స్వర్గస్తులు కాగా విషయాన్ని తెలుసుకుని మృతి చెందిన వారికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీమతి మాకినీడి శేషుకుమారి వాటి వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు గ్రామంలో తమ్మలపూడి రత్నం, పోసిన చంద్రిక, దేవినేడి మహేష్ ఆ గ్రామంలో వారి ఇంటికి వెళ్లి, వారి చిత్రపటాల ముందు మౌనం పాటించి, వారి పవిత్రమైన ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులలో మానసిక ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.