పాటంశెట్టి సూర్యచంద్రను కలిసి ఆరొగ్య వివరలు తెలుసుకున్న మాకినీడి శేషుకుమారి

పిఠాపురం, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆమరణ దీక్షలో ఉన్న పాఠంశెట్టి శ్రీదేవి సూర్యచంద్ర కి సంఘీభావం తెలపడం జరిగింది. దీక్ష విజయవంతంగా విరమించారు. గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న దేవి సూర్యచంద్ర ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అక్కడ ఉన్న డాక్టర్ తో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండలం ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, గోపు సురేష్, గొల్లపల్లి గంగ, వెలుగుల లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి వినుకొండ అమ్మాజీ, ఎంపిటిసి అభ్యర్థి కేతినీడి గౌరీ నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.