ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 26వ రోజు పాదయాత్ర

ఏలూరు, ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా శనివారం పవర్ పేట స్టేషన్ సెంటర్ మీదుగా ఆర్.ఆర్.పేట, పత్తేబాద ఐదు గుళ్ళసెంటర్ వరకు పాదయాత్రను జననీరాజనాల నడుమ రెడ్డి అప్పల నాయుడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాఘవయ్య చౌదరి మరియు శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం సంక్షేమ పథకాల మీద ఉన్న దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద పెడితే ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అవుతుంది. కానీ జగన్ మోహన్ రెడ్డి తన సొంత స్వలాభం వ్యాపార అభివృద్ధి కోసం కేవలం ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని రెడ్డి అప్పల నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భ్రష్టు పట్టిన వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించే శక్తి పవన్ కళ్యాణ్ అని రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. వ్యాపారస్తులు అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఇక్కడ ఉన్న వ్యాపారస్తుల వ్యాపారం చాలా దీనస్థితిలో ఉన్నాయని ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని స్థానిక వ్యాపారస్తులు జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ముందు ఆవేదనా వ్యక్తం చేశారు. టూటౌన్ మార్కెట్లో నిర్మాణం చేసిన దుకాణాల్లో మధ్యలో సరైన దారిలేక ఇబ్బందులు పడుతున్నారని, అలాగే వ్యాపారస్తులు బయట నుండి వచ్చి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు వ్యాపారాన్ని సజావుగా సాగినవకుండా చేస్తున్నారని చాలా ఇబ్బందులకు గురౌతున్నామని చెప్పి తెలియజేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని ఉద్దేశం ఉంటే నూతనంగా యూనివర్సిటీ ఏర్పాటు చేసి మీ తండ్రి పేరు పెట్టుకొమ్మని రెడ్డి అప్పల నాయుడు సూచించారు. ఏలూరు నియోజకవర్గంలో ఏ డివిజన్లో చూసిన అనేక రకాల సమస్యలు ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని, ఒక వైపు చెత్త ఆలోచనతో చెత్త పన్ను వేస్తూ మరో వైపు ఇంటి పన్ను విధిస్తూ, కరెంట్ ఛార్జీలు భారీగా పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని, ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తున్నారు అని రెడ్డి అప్పల నాయుడు ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటను ప్రారంభించిన తరువాతే ఏలూరు నియోజకవర్గంలో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం వారిలో కదలిక వచ్చింది అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళనానికి కనిపించడం లేదా అని రెడ్డి అప్పల నాయుడు ప్రశ్నించారు. ఏలూరు నియోజకవర్గంలో గడిచిన 38 నెలలుగా ప్రజల యొక్క ఆవేదన వినే నాధుడు లేకుండా పోయారు. అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లోనూ విఫలమవుతున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటు ప్రజల్ని అటు ప్రభుత్వాన్ని మేల్కొలిపి చైతన్య పరచడానికి ఈ జనసేన పోరుబాటను ప్రారంభించడం జరిగింది అని ఆయన వివరించారు. డివిజన్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా ఇటు మున్సిపల్ కమిషనర్ కి, అటు అధికారులకు నివేదిక రూపంలో తెలియజేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, నగర ఉపాధ్యక్షులు బొత్స మధు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, నగర ఉపాధ్యక్షుడు బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యులు బోండా రాము, కోశాధికారి పైడి లక్ష్మణరావు, కార్యనిర్వహక కార్యదర్శి గొడవర్తి నవీన్, నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, బొద్దాపు గోవిందు, కందుకూరి ఈశ్వరరావు, సుందరనీడి ప్రసాద్, బుద్ధా నాగేశ్వరరావు, సోషల్ సర్వీస్ మురళి, దనానా విజయ్, అగ్గాల శ్రీనివాస్, పల్లి విజయ్, తోట దుర్గా ప్రసాద్, వీర మహిళలు గిడుతూరి పద్మ, కావూరి వాణి, గుదే నాగమణి, సరళ, సుజాత, ఉమా దుర్గా జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.