జనసేన నాయకుల సమక్షంలో ఘనంగా మాకినీడి శేషుకుమారి పుట్టినరోజు వేడుక

*ప్రముఖ రాష్ట్ర జనసేన నేత నాదెండ్ల మనోహర్, జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ నియోజకవర్గ ఇన్చార్జిల సమక్షంలో మాకినీడి శేషుకుమారి పుట్టినరోజు వేడుక శుభాకాంక్షలు

తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి సోమవారం పుట్టినరోజు కావడం, రాష్ట్ర ప్రముఖ జనసేన నేత నాదెండ్ల మనోహర్ మత్స్యకార అభ్యున్నతి యాత్రలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, నియోజకవర్గ ఇన్చార్జులు, జనసైనికులతో, జిల్లా పర్యటనలో భాగంగా మత్స్యకారుల పలు సమస్యలు తెలుసుకోవడంతో పాటు, యాత్రలో రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలువురు నియోజకవర్గ నేతల సమక్షంలో సోమవారం పుట్టినరోజు జరుపుకుంటున్న మాకినీడి శేషుకుమారి చేత కేక్ కట్ చేయించి వేడుకను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పలువురు మాకినీడి శేషుకుమారికి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, తుమ్మల బాబు, బండారు శ్రీనివాస్, పోలిశెట్టి చంద్రశేఖర్, పాఠంశెట్టి సూర్యచంద్ర, అనుశ్రీ సత్యనారాయణ, వరుపుల తమ్మయ్య బాబు, సంగిశెట్టి అశోక్, తలాటం సత్య, గంటా స్వరూప, పోలసపల్లి సరోజ, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరది వల్లి రామకృష్ణ, గోపు సురేష్, కార్యకర్తలు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.