వెండితెర లైఫ్ ని “లైఫ్” తో ప్రారంభించిన కొట్టె మల్లికార్జున్

పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్ఫూర్తితో సినీ కళా, రాజకీయ రంగంలో అరంగ్రేటం చేసి తనదైన ముద్ర వేస్తున్న కర్నూలు జిల్లా యువ నటుడు, బిజెపి యువ నాయకుడు: కొట్టె మల్లికార్జున్

కర్నూలు జిల్లా, సాధారణ గ్రామీణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి కర్నూలు జిల్లా డోన్ మండలం సీసంగుంతల గ్రామానికి చెందిన కొట్టె సోమిరెడ్డి మనవడు వీరయ్య, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు మల్లికార్జున చిన్నతనం నుంచే విద్యతో పాటు, ఇతర రంగాల్లో రాణిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ అంచలంచెలుగా ఎదుగుతున్నారు. పోలీస్ సబ్ జైల్ లో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించే తన అన్న కొట్టె రాజశేఖర్, ఇతర మిత్రులు అన్ని విధాలుగా అండగా నిలవడం వల్లే ఇదంతా సాధ్యం అయిందని పేర్కొన్నారు.తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య పుట్టిన పెద్ద పాడు గ్రామం లో ఆరు నుంచి పదవ తరగతి వరకు చదివారు. చిన్నతనంలోనే స్కూల్ పీపుల్ లీడర్ గా అన్ని తరగతుల విద్యార్థులతో కలిసిమెలిసి,మెలుగుతూ నాయకత్వ లక్షణాలు ఏర్పరుచుకున్నారు. అలాగే ఇంటర్మీడియట్ సిద్ధార్థ జూనియర్ కాలేజ్ డోన్ లో, శ్రీ శంకరాస్ డిగ్రీ కాలేజ్ కర్నూల్ లో సైన్స్ డిగ్రీ పట్టా పొందినప్పటికీ, గ్రామీణ నేపథ్యంతో వచ్చిన వ్యక్తిగా గ్రామీణ సమస్యలను నిర్మూలించాలనే లక్ష్యంతో అనంతపురం శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీలో పీజి ఏమ్.ఎ రూరల్ డెవలప్మెంట్ పూర్తి చేసి, గ్రూప్స్, సివిల్స్ ప్రిపేర్ అవుతూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్ ఆర్ సి రెడ్డి లో గ్రూపు1 మరియు ఎన్ టి ఆర్ విద్యోన్నతి పథకం లో మెరుగైన ర్యాంకు సంపాదించి, ఢిల్లీ శ్రీరామ్ ఐఏస్ లో ఉచిత సీటు సంపాదించి, సివిల్స్ లక్ష్యంగా కోచింగ్ పూర్తి చేసుకొని రెండు సార్లు గ్రూప్స్, ఎస్ ఐ మెయిన్స్ రాసినప్పటికీ, కొద్ది మార్కుల వ్యవధిలో ఉద్యోగం కోల్పోయినప్పటికీ, కృషి, పట్టుదలతో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సినీరంగంలోకి వెళ్లడం జరిగింది. కొన్ని సినిమాల్లోనూ, మరికొన్ని సీరియల్స్ లో నటించి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలనీ, ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజా సమస్యలను తీర్చాలనే లక్ష్యంతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరియు బైరెడ్డి రాజశేఖర రెడ్డి, బైరెడ్డి శబరి, ఇతర రాజకీయ నాయకుల స్ఫూర్తితో ప్రజాక్షేత్రంలో రాజకీయ ఆరంగ్రేటం చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకుడిగా ,ఉన్నత విద్యా వంతుడుగా, ప్రజా సమస్యల కోసం ప్రశ్నించే యువ నాయకుడు గా ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుని, ఇతర బిజెపి నాయకులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యల మీద ధర్నాలలో పాల్గొంటూ, అందరి మన్ననలు పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తులో యువతలో బలమైన యువ నాయకుడుగా ఎదగడం తోపాటు సినీ రంగంలో కూడా అత్యున్నత స్థాయిని అధిరోహిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సినీ కళా రంగంలోనూ మరియు రాజకీయ రంగంలోనూ రాణిస్తూ,ఎంతో మందికి స్ఫూర్తిగా, ఆదర్శంగా ఉంటూ ప్రజా సేవ చేయాలని తన మిత్రులు ,డోన్ బిజెపి నాయకులు, ఇతర నేతలు కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఆత్మవిశ్వాసంతో, దైర్యంతో అడుగులు ముందుకు వేస్తూ మనిషి తలుచుకుంటే జీవితంలో ఏమైనా సాధించవచ్చని కొట్టె మల్లికార్జున్ నిరూపించారు. కొట్టె మల్లికార్జున్ మాట్లాడుతూ యువత చిన్న సమస్యలకే కుంగిపోయి, ఆత్మన్యూనతా భావంతో, రకరకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కావున యువతీ, యువకులు ఇలాంటి యువ నాయకులను, జాతి రత్నాలను ఆదర్శంగా తీసుకొని కృషి చేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని పేర్కొంటూ, ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగిన మనం వచ్చిన మూలాలు, మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభావంతో ఉంటూ, ఎంతో మందికి ఆదర్శ ప్రాయంగా నిలవాలని పేర్కొనడం జరిగింది.