పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న జనసేన పార్టీ మలికిపురం ఎంపీపీ

*రాజోలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమలలో జనసేన పార్టీ ఎంపీపీ శ్రీమతి మేడిచర్ల వెంకట సత్యవాణి రాము పాల్గొన్నారు

రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం లక్కవరంలో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వార్డులను పరిశీలించారు ప్రసూతి మహిళలకు పూర్తి స్థాయిలో పోషక విలువలతో కూడిన ఆహారం అందివ్వాలని ఆమె సూచించారు, శిశు సంరక్షణ సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు మరియు రాబోవు రోజుల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. జనసేన ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకమైన విధానాలు తీసుకువస్తామని ఆమె అన్నారు. విద్యా మరియు వైద్యానికి పెద్ద పీట వేస్తామని చెప్పారు. అనంతరం ఆలయ శంకుస్థాపన కార్యక్రమలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలకు ఆధ్యాత్మిక జీవనం కూడా చాలా ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ మరియు స్థానిక ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.