పెరిగిన ‘మా ‘ఎన్నిక‌ల వేడి.. త‌న‌ ప్యానెల్ స‌భ్యుల పేర్ల‌ను ప్ర‌క‌టించిన మంచు విష్ణు

మా అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అక్టోబర్ 10 ఆదివారం పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ని ప్రకటించగా…మంచు విష్ణు మా కోసం మనమందరం అంటూ తన ప్యానల్ ను ప్రకటించారు.

జనరల్ సెక్రెటరీ గా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్, వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, పృథ్వీరాజ్ వైస్ ప్రెసిడెంట్, శివ బాలాజీ ట్రెజరర్ , జాయింట్ సెక్రటరీ కరాటే కళ్యాణి, జాయింట్ సెక్రటరీ గౌతమ్ రాజు లు పోటీ పడుతున్నారు.

ఇక అర్చన, అశోక్ కుమార్ ,గీతాసింగ్, హరినాథ్ బాబు, జై వాణి, మలక్ పెట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వర్ రెడ్డి, రేఖ, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వప్నమాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎమ్మార్పీ ప్యానల్ అభ్యర్థులుగా పోటీలో దిగుతున్నారు.