‘మనో విరాగి’ బయోపిక్‌ పోస్టర్‌ విడుదల

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మనో విరాగి’. బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నరేంద్ర మోదీ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. గురువారం మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బయోపిక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

హిందీతో పాటు తెలుగు, మరికొన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తుండగా.. సంజయ్ త్రిపాఠి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రతీ ఒక్కరి ప్రయాణం వారి నుండే మొదలవుతుంది అనే కాన్సెప్ట్ తో మనో విరాగి టైటిల్ కు క్యాప్షన్ ను జత చేసారు. ఇప్పటికే నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ఒక సినిమా తెరకెక్కిన విషయం తెల్సిందే.

ఇక మనో విరాగి చిత్రం విషయానికొస్తే ఈ సినిమాలో నరేంద్ర మోదీ సాధారణ యువకుడిగా మొదలై దేశానికే ప్రధాని  మంత్రిగా ఎదిగిన తీరుని ఎంతో ఇన్స్పిరేషనల్ గా చూపించబోతున్నారు. నరేంద్ర మోదీ పాత్రలో అభయ వర్మ నటిస్తున్న ‘మనో విరాగి’ చిత్రాన్ని.. మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని వాద్ నగర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు ప్రదేశాలలో చిత్రీకరించారు. మనో విరాగి షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆలస్యమైంది.