జనసేన పార్టీ లో పలువురి చేరిక

కదిరి: కదిరి టౌన్, మశానం పేటకు సంబంధించిన పలువురు ముస్లిం యువకులు నిస్సార్ నాయకత్వంలో కదిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. వారికి కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. శ్రీ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నచ్చి వారు రైతులకు, భవన నిర్మాణ కార్మికులకు వారు చేస్తున్న కృషి నచ్చి, అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమాల కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు లక్ష్మణ్, చలపతి, కిన్నెర మహేష్, అంజి బాబు, రవీంద్ర నాయక్, మహబూబ్ బాషా, సాదిక్, జున్ను, రోషన్, నిస్సార్, చక్రధర్, సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.