బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనలో పలువురు నాయకుల చేరిక.!

*మార్పు మెదలైయిoది! ఈ రాష్ట్రానికి దశ దిశా చూపించే నాయకుడు జనసేనానినే! మా గొప్ప నాయకుడు బండారు శ్రీనివాస్ కు అండగా నిలబడతాము! రాష్ట్ర గౌడ సేన జనరల్ సెక్రటరీ నంగెడ్డ రంగారావు గౌడ్, పలువురు నాయకులు భారీగా చేరిక

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలో ఉన్న, ఆలమూరు మండలంలోని, జొన్నాడ గ్రామానికి చెందిన ప్రమఖు బిసి గౌడ కుల నాయకులు నంగెడ్డ రంగారావు గౌడ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా నంగెడ్డ రంగారావు గౌడ్ మాట్లాడుతూ.. మా కొత్తపేట నియోజక వర్గంలోని, నాలుగు మండలాల్లో జనసేన పార్టీ ఎంతో బలోపేతం అయిoదని, జనసేనాని ఆశయాలతో, విలువలతో కూడిన గొప్ప నాయకుడు జనసేనాని అని, జనసేన పార్టీలో అన్ని వర్గాల వారికీ సమన్యాయం జరుగుతుందని, ఈ పార్టీలోకి సంతోషంగా ఆహ్వానం పలుకుతూ, అందరినీ సమానంగా ప్రాతినిధ్యం కల్పిస్తూ, అక్కున చేర్చుకుంటూ, అందరి కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ, జనసేన పార్టీని మరింత వేగంగా ముందుకు నడిపిస్తూ ఉన్న బండారు శ్రీనివాస్ నాయకత్వంలోనూ, నీతి నిజాయితీతో విలువలు కూడిన నాయకుడు జనసేనాని వెంట నడుస్తున్న గొప్ప నాయకుడిగా బండారు శ్రీనివాస్ నాయకత్వానికి మేమంతా జై కొడుతున్నాం. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి, అన్ని వర్గాలను చేర్చుకుంటూ.. అందరి వాడిగా జనసేనానిని ముందుకు నడిపిస్తున్న.. మా కొత్తపేట నియోజకవర్గం జనసేన రథసారధి బండారు శ్రీనివాస్ నాయకత్వంనకు తిరుగులేదని.. ఈ పార్టీ అభివృద్ధికి.. ఎంతో సహకారం మేము కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎలాంటి కష్టసుఖాల్లో నైనా జనసేన పార్టీ వైపు నిలబడతామని, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు చింతలపూడి శ్రీనివాస్, చెల్లె ప్రేమ్ శేఖర్, వడ్డీ ప్రసాద్ తదితరులు జనసైనికులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.