గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

నెల్లూరు: జనసేనాని జన్మదినం సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లండి అని జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపుమేరకు శుక్రవారం జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నెల్లూరు రూరల్ లోని కందమూరు, ఎస్ సి కాలనీలో ఎంపీపీ పాఠశాల నందు చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు, పలకలు పంపిణీ చేశారు. జనసేనాని జన్మదినం సందర్భంగా ఆడంబరాలకు పోకుండా ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లి జనసేన పార్టీ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిందని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యకారమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, రీజినల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, జిల్లా సెక్రెటరి ప్రశాంత్ గౌడ్, నెల్లూరు నగర వీర మహిళ రేణుకా, నెల్లూరు రూరల్ వీరమహిళ రేవతి, మౌనేష్, కేశవ, కందమూరు గ్రామ జనసేన నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.