“మారన్” ఫస్ట్ లుక్..

తమిళ సినిమా ప్రముఖ నటులలో ఒకరైన ధనుష్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ధనుష్ తన 43వ చిత్రంతో బిజీగా ఉన్నారు. “డి43” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సత్యజోతి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. మలయాళ స్క్రీన్ రైటర్స్ సర్బు, సుకాస్ కూడా ఈ సినిమా టెక్నీకల్ టీంలో భాగమయ్యారు. ధనుష్ సరసన మాళవిక మోహనన్‌ రొమాన్స్ చేయనుంది. మహేంద్రన్, సముతిరకని, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చుతున్నారు.

ధనుష్ తన 38వ పుట్టినరోజు కానుకగా #డి43 చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘మారన్’ అని పేరు పెట్టారు. ‘మారన్’ అనేది తమిళ పాండ్య రాజుల కాలంలోని పేరు. ఈ చిత్రం థ్రిల్లర్ కథా నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ చిత్ర పోస్టర్‌లో ధనుష్ చేతిలో పెన్ను పట్టుకుని ఓ వ్యక్తిని కొట్టడం కనిపిస్తుంది. అలాగే అద్దాలు ముక్కలుగా విరిగి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ చిత్రంలో ధనుష్ జర్నలిస్ట్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ధనుష్ అభిమానులు # D43FirstLook #HappyBirthdayDhanush అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.