ముఖరం చాన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ముఖరం చాన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీగా చేరిన యువత. రాజంపేట పట్టణంలోని సుమారు 150 మంది యువకులకు జనసేన కండువా కప్పి ఆహ్వానించిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ముఖరం చాన్ మరియు యల్లటూరు శివరామరాజు. వారు మాట్లాడుతూ.. యువత భవిష్యత్తుకు బాటలు వేయాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం మరియు రాష్ట్రంలో యువత మొత్తం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అండగా నిలబడి ఉందని చెప్పడానికి రాజంపేట యువతే నిదర్శనం అని
స్వచ్ఛందంగా రాజంపేట యువత సుమారు 150 మంది జనసేన పార్టీలో చేరడం శుభసూచికమని యువతకు అన్ని విధాలా అండగా నిలబడతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సయ్యద్ ముకర్రం చాన్ మరియు మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, జనసేన పార్టీ లీగల్చల్ అధ్యక్షులు కరుణాకర్ రాజు, ఉపాధ్యక్షులు కత్తి సుబ్బరాయుడు, నగర అధ్యక్షులు పలుకూరు శంకర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్, మౌల, పత్తినారాయణ, చిట్టే బాస్కర్, అబ్బిగారి గోపాల్, జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ లతీఫ్, షేక్ సలీం, షేక్ ఇమ్రాన్, నవాబ్ సలీం, షేక్ మూస, సింగమల రామ్మూర్తి, ఉత్తరాది శివ, అంకి శెట్టి మణి, నగరిపాటి మహేష్, రెడ్డి ప్రసాద్, తదితరులు పాల్గొని కొత్తగా పార్టీలో జాయిన్ అయిన యువతను ఉత్సాహంగా పార్టీలోకి వెల్కమ్ చేయడం జరిగింది.