బత్తుల ఆధ్వర్యంలో భారీ చేరికలు – రాజానగరంలో వార్ వన్ సైడ్…!

  • బత్తుల ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి ఉధృతంగా కొనసాగుతున్న చేరికలు
  • రాజానగరం నియోజకవర్గం ఇప్పుడు పూర్తిగా జనసేన మయం
  • రానున్న రోజుల్లో మరిన్ని చేరికలతో “వార్ వన్ సైడ్” అనే స్థాయిలో జనసేన పార్టీ
  • రాజానగరం నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చూపు జనసేన వైపే
  • జనసేన పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం.. పూర్తిగా డీలాపడుతున్న వైస్సార్సీపీ
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా నియోజకవర్గంలో ఈ అరాచక వైస్సార్సీపీ రాక్షస పార్టీని గద్దె దింపి, జనసేన పార్టీని గెలిపించడానికి ‘బత్తుల’ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళిక సిద్ధం

రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ జనసేనలో చేరిన దగ్గర్నుండి నిత్యం నియోజకవర్గంలో ఇతర పార్టీలకి చెందిన కార్యకర్తలను జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలను చేస్తూనే ఉన్నారు. రాష్ట్రం మొత్తం రాజానగరం నియోజకవర్గం గురించే చర్చించుకునేలా శరవేగంగా పార్టీని ముందుకు తీసుకెళుతున్న ఈ శుభతరుణంలో రాజానగరం మండలం, కొత్త వెలుగుబంద గ్రామం నుండి వైసీపీ, టిడిపి నుండి సుమారు 200 మంది కార్యకర్తలు అరాచక పాలన చేస్తూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సహజ వనరులను దోచుకు తింటూ, అసమర్ధ పాలన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే పనితీరుకు విసుకు చెంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ఆయన రాజకీయ ప్రయాణం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తపన, అదే సమయంలో రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు అనునిత్యం చేస్తున్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటూ, నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్న తీరు, చేస్తున్న దానధర్మాలు, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆయన నిలబడుతున్న తీరు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆయన సమర్థమైన నాయకత్వానికి ఆకర్షితులై బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ బత్తుల దంపతులు జనసేన పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయం కోసం అందరూ సమిష్టిగా కృషి చేసి, నీతి నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని రక్షించి, ఈ అరాచక ప్రభుత్వంపై అందరూ సమిష్టిగా తిరుగుబాటు చేసి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపి, జనసేన పార్టీ స్థాపించడానికి అందరూ సమైక్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.