జనసేన పార్టీలో భారీ చేరికలు

రంపచోడవరం: రాజవొమ్మంగి మండలం, చెరుకుంపాలెం పంచాయితీ, సంజీవనగరం గ్రామంలో బుధవారం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బొధి రెడ్డి త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ 30 కుటుంబాల వారు జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరినీ జనసేన పార్టీ కండువా వేసి కొర్ల రాజశేఖర్ రెడ్డి పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి తాము పార్టీలో చేరుతున్నట్టు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా చెరుకుంపాలెం జనసేన పార్టీ పంచాయితీ ఇంచార్జిగా మడకం సత్యనారాయణ సెక్రటరీగా కోటం ఆదినారాయణ, యూత్ ప్రెసిడెంట్ గా ముర్కుర్తి కిరణ్ కుమార్ లను నియమించినట్లు బొధిరెడ్డి త్రిమూర్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజవొమ్మంగి మండల అధ్యక్షులు బొధిరెడ్డి త్రిమూర్తులు, యువజన అధ్యక్షులు కొచ్చా లోకేష్, రాజవొమ్మంగి జనసేన పార్టీ మండల నాయకులు పోకల మల్లికాసులు, అడ్డతీగల మండల నాయకులు కుప్పాల జయరాం, జడ్డంగి జనసేన నాయకులు వడుగుల శ్రీనివాస్, జర్త సాయి పాల్గొనడం జరిగింది.