కాకినాడ రూరల్ జనసేనలో భారీ చేరికలు

  • పంతం నానాజీ సమక్షంలో వైసీపీ, టీడీపీల నుండి జనసేనలో పార్టీలో చేరికలు

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, వెళంగి గ్రామంలో జనసేన పార్టీ వేళంగి గ్రామ అధ్యక్షులు పైడి కొండల ప్రసాద్ ఆధ్వర్యంలో వేళంగి కోప్పిసెట్టి పేటలో సుమారు 20 మంది వైసీపీ, టీడీపీకి చెందిన యువత, పెద్దలు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీలోకి స్వచ్ఛందంగా వచ్చారని, వై.సి.పి నుండి పంచాయతీ 10వ వార్డు సభ్యులుగా గెలుపొందిన మట్టపర్తి దుర్గామూర్తి, గుత్తుల శేషగిరి, యనమదల చంద్రరావు, యానమదల హరిశంకర్, వై. వీరబాబు, గుత్తుల శ్రీనివాస్ గుబ్బల సూరిబాబు, వల్లు ఏడుకొండలు, రాజు, దుర్గా, రమేష్, తదితరులు మెంబర్ గా విజయం సాధించిన వారు కూడా ఆ పార్టీకి పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలోకి వచ్చారని తెలిపారు. నీతి, నిబ్బద్ధతతో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా నమ్ముకున్న సిద్ధాంతాలను పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ రాష్ట్ర భవిష్యత్ బాగుపడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు బండారు మురళి, సీనియర్ నాయకులు వెలుగుబంట్ల సూరిబాబు, స్టేట్ జాయింట్ సెక్రెటరీ బోగిరెడ్డి గంగాధర్, విష్ణు, నల్ల దుర్గ ప్రసాద్, శాఖ శ్రీనివాస్, కుక్కల మురళి, ఒళ్ళు ఏడుకొండలు, గుబ్బల సూరిబాబు, గణేష్ నాయుడు, బిరుదా బాబు, మణికంఠ, సురేంద్ర, జనసైనికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.