ఎచ్చర్లలో జనసేన భారీ కవాతు

శ్రీకాకుళం జిల్లా.. ఎచ్చర్ల నియోజకవర్గం.. ఎచ్చర్ల మండలంలో భారీ కవాతు మరియు భారీ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమమలో బారి ఎత్తున జన సైనికులు వీరమహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేతాజీ గ్రంద రచయిత ఎంవిఆర్ శర్మ, ఆలాగే రాష్ట్ర పర్యావరణ శాఖ కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, అమదాలవస నియోజకవర్గ జనసేన నాయకులు పెడాడ రామ్మోహన్, ఎచ్చర్ల నియోజకవర్గ నాయకులు భూపతి అర్జున్ కరిమజ్జి మల్లీశ్వారావు హాజరు అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన వైఫల్యం గూర్చి వివరించారు, ఆలాగే ప్రస్తుతం ప్రతి వస్తువు పైన పెంచిన ధరల గూర్చి వివరించారు, ఆలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ పరిపాలన అత్యంత అవసరం అని కొనియాడారు. అలాగే ప్రతి ఒక్క జనసైనికుడు తమ తమ గ్రామాల్లో ప్రతి గడప గడపకు వెళ్లి జనసేన సిద్దాంతాలు, మేనిఫెస్టోను వివరించి ప్రజల్లోకి జనసేనపార్టీని తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల మండల నాయకులు తమ్మినేని శ్రీను లావేరు మండలం నాయకులు వడ్డిపిల్లి. శ్రీనివాసరావు, బొంతు విజయకృష్ణ, రణస్థలం మండలం నాయకులు దన్నాన చిరంజివి, సువ్వాడ రామారావు, పోట్నూరు మణమ్మ, పోట్నూరు లక్ష్మునాయుడు, పైడిరాజు అప్పాపురం రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.