కొండపై భద్రత లోపంపై 10న ఏ.డి బిల్డింగ్ వద్ద భారీ నిరసన

  • అఖిలపక్ష పార్టీలతో పాటు స్థానికులు , శ్రీవారి భక్తులు ధర్నాకు తరలిరావాల్ని పిలుపు

తిరుపతి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీవారి ఆలయం తిరుమలలో భారీ స్థాయిలో భద్రతా లోపం స్పష్టంగా బయటపడిందని, దీనిపై అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షంతో పాటు స్థానికులు, శ్రీవారి భక్తులతో కలసి ఈనెల 10వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు స్థానిక టీటీడీ పరిపాలన భవనం వద్ద టీటీడీ నిర్లక్ష్యం, నిఘా వైఫల్యంపై భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని, టిడిపి నేతలు నరసింహా యాదవ్, మునస్వామి, జనసేన పార్టీ నేతలు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, కీర్తన, బద్దెన మధుబాబు, సుమన్ బాబు, కిషోర్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత శివశంకర్ తదితర అఖిలపక్ష పార్టీలతో కలిసి హాజరైన వారు మాట్లాడుతూ వైసిపి పాలనలోకి వచ్చాక అన్యమత ప్రచారాలు, గంజాయి తదితర మత్తు పదార్థాలు విచ్చలవిడి అయ్యాయని, చివరకు శ్రీవారి ఆలయంపైనే డ్రోన్ కెమెరాలు, విమానాలు ప్రయాణించడం, నేడు సాక్షాత్ శ్రీవారి గర్భగుడి ఆనంద నిలయంనే వీడియో తీసి విడుదల చేయడం చూస్తుంటే టీటీడీ నిర్లక్ష్యం, నిఘా వైఫల్యం స్పష్టంగా బయటపడిందని, దీని వెనుక ఏదైనా కుట్రలు దాగి ఉన్నాయని మండిపడ్డారు. తిరుమల భద్రతను గాలికి వదిలేసి, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచక వారి కడుపు కోత పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికుల ధర్నా చేస్తుంటే కొండపై టీటీడీ అధిష్టానమే ఫోటోలకు చీపురుబడితే ఆ సమయంలో హాన్స్, సిగరెట్టు ముక్కలు కనిపించడంలోనే విజిలెన్స్ అధికారుల భద్రత లోపం స్పష్టమైందని విమర్శించారు. ఈ వైఫల్యంపై టీటీడీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ధర్నాను విరమించేది లేదని హెచ్చరించారు.