మాక్స్ హాస్పిటల్ నిర్వాకం.. కరోనా చికిత్సకు 1.8 కోట్ల రూపాయల బిల్లు!

కరోనా వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. లాక్ డౌన్ కారణంగా కొంతం మంది ఉపాధి కోల్పోతే కొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఆసుపత్రుల విషానికి వస్తే చాలా వరకు ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుండి భారీగా దండుకున్న ఘటనలు చాలా వరకే చూసాము.

భారీగా బిల్లులు వేయటమే కాకుండా, డబ్బు కట్టనిదే మృతదేహాలను ఇవ్వని ప్రైవేటు ఆసుపత్రులను చూసాము.. ప్రస్తుతం ఇలాంటి ఒక ఘటనే ఒకటి డిల్లీలో వెలుగులో చూసింది. అదేంటంటే.. ఒక ప్రైవేటు ఆసుపత్రి కరోనా రోగికి నుండి ఏకంగా అక్షరాల 1.8 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

అవును నిజం.. ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్ ఒక కరోనా రోగికి చికిత్స అందించి వారి నుండి 1.8కోట్ల రూపాయలను వసులు చేసింది. ఈ విషయం వెలుగులోకి రావటంతో కాంగ్రెస్‌ ఎంపీ మనీష్ తివారీ “కరోనా చికిత్సకి 1.8 బిల్లు ఎలా అవుతుంది..?? రోగి నుండి ఆసుపత్రి యాజమాన్యం ఇంత మొత్తం ఎలా వాసులు చేస్తుంది..?? దీనిపైన పూర్తీ విచారణ జరపాలని మరియు తగిన చర్యలు తీసుకోవాలని” ప్రభుత్వాన్ని ఆయన డిమాడ్ చేసారు. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అధికారులను నియమించి విచారణ జరపాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయాకు లేక రాశారు. ఇలాంటివి జరగకుండా ఉండటానికి ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కోరారు.
ఈ సంఘటనపై ఆమ్-ఆద్మీ పార్టీ (మాళవ్య నగర్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి మాక్స్ హాస్పిటల్ పై తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ ఘటనపై సామాన్యులతో పాటు పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.

దీనిపై స్పందించిన మాక్స్ హాస్పిటల్ యాజమాన్యం కరోనా చికిత్స కోసం సదరు వ్యక్తి ఏప్రిల్ లో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, దాదాపు నాలుగు నెలల పాటు చికిత్స అందించామని తెలిపారు. అంతేకాకుండా, ఆ రోగికి హైపర్‌టెన్షన్, పిత్తాశయం ఇన్ఫెక్షన్ , టైప్ -2 డయాబెటిక్ మరియు మెదడు పని తీరు మందగించటం వలన వ్యక్తి ప్రాణాల కోసం చాలా శ్రమించామని మరియు రోగికి అన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించటం వలన ఆ మేరకు ఖర్చు అయిందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.