కొండపల్లిలో ఘనంగా మేడే వేడుకలు

కొండపల్లి బి. కాలనీ వద్ద ఎంసిపిఐ నాయకులు బసవయ్య ఆధ్వర్యంలో కార్మికులు ఆఫీస్ ప్రారంభోత్సవం మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన అక్కల రామమోహన్ రావు (గాంధీ), కొండపల్లి మాజీ సర్పంచ్ కొల్లి వెంకటేశ్వర రావు, వంగవీటి రాజేశ్వరరావు, యతిరాజుల ప్రవీణ్, దొడ్డకుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.