జనసేనపార్టీ శ్రీకాళహస్తి పట్టణ కమిటీ నియామకం

శ్రీకాళహస్తి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదంతో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడిగా భవాని శంకర్ రామానాయుడుని నియమించడం విదితమే. పూర్తి స్థాయి శ్రీకాళహస్తి పట్టణ కమిటీ సభ్యులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ సూచనల మేరకు నియమించడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణంలోని సమావేశం ఏర్పాటు చేసి నియామక పత్రాలను నూతనంగా నియమింపబడ్డ నాయకులకు అందించడం జరిగింది అని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి వినుత కోట తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మణికంఠ, డా.పవన్ బొక్కిశం, ప్రధాన కార్యదర్శులుగా షేక్ కరీముల్లా, రవి కుమార్ రెడ్డి, నగేష్, సురేష్, ప్రమోద్ లను, కార్యదర్శులుగా సలీం, మున్నా, తేజా, ఖాదర్ లను, సంయుక్త కార్యదరర్శులు గిరీష్, శేఖర్ రెడ్డి, చందు, సుబ్రమణ్యం తదితరులు పాల్గొనటం జరిగింది.