పైడిమాంబ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: పాలవలస యశస్వి

విజయనగరం: ప్రజలందరికి పైడిమాంబ ఆశీస్సులు ఉండాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్, జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు పాలవలస యశస్వి కోరారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగర ప్రజల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని సోమవారం తోలెళ్ళు ఉత్సవం సందర్బంగా దర్శించుకున్నారు. పైడిమాంబ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మ వారిని దర్శించిన వారిలో జనసేన పార్టీ నాయకులు ప్రసాద్, పుష్ప, రౌతు సతీష్, యోగేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.