యూపీ ఎన్నికల విషయంలో పొత్తుపై మాయావతి క్లారిటీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో బహుజన సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేసింది.జరగబోయే ఎన్నికలలో బీఎస్పీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకొని స్పష్టం చేసింది.

ఉత్తరప్రదేశ్లో మాత్రమేకాక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కూడా బి ఎస్ పి ఎవరితో పొత్తు పెట్టకుండా ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు మాయావతి క్లారిటీ ఇచ్చారు.జనవరి 15వ తారీఖు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ విషయంలో చేపట్టిన చర్యలు స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.అంతేకాకుండా ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని తెలిపారు.మరోపక్క ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళనలు నిరసనలు చేపడుతున్న రైతులకు బిఎస్పి పార్టీ మద్దతు తెలుపుతోందని స్పష్టం చేశారు.ఈ విషయంలో కేంద్రం రైతులకు సానుకూలంగా స్పందించాలని కోరారు.

గతంలో నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాయావతి వ్యవహరించడం జరిగింది.కాగా ఈ రోజు ఆమె పుట్టిన రోజు కావటంతో బీఎస్పీ పార్టీ నాయకులు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న దళిత జాతికి చెందిన ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.