కందుల దుర్గేష్ అధ్యక్షతన మీడియా సమావేశం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 15, 16, 17 తేదీలలో ఉత్తరాంధ్ర పర్యటన చేయబోతున్న సందర్బంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను శుక్రవారం రాజమండ్రిలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఖండిస్తూ, వైజాగ్ విమానాశ్రయానికి జనసేన శ్రేణులు అందరూ పాల్గొని వారికి ఘనంగా స్వాగతం పలకాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, వివిధ నియోజకవర్గాల ఇంచార్జులు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.