రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో జనసేన నాయకుల సమావేశం

  • 100 మందితో జనసేన అభ్యర్థులకు ప్రచారం చేయాలని నిర్ణయం

తెలంగాణలో జనసేన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడుతున్న నేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల ముఖ్య నాయకులు జనసేన రాష్ట్ర నాయకులు మహేష్ పెంటల ఆధ్వర్యంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు. ఎండియేతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 11 స్థానాలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపుకై దాదాపు 100 మంది నియోజకవర్గ జనసైనికులతో ఇంటింటి ప్రచారం చేసి జనసేన గెలుపుకై కృషి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు జనసేన లక్ష్యం అని జనసేన అవసరం ఈ సమాజానికి కచ్చితంగా ఉంది, చదువుకున్నవారు, నిస్వార్థపరులు సమాజం పైన చిత్తశుద్ధి ఉన్న నాయకులను జనసేన సమాజానికి అందిస్తుందని, జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో బరిలో నిలుస్తుంది. సామాన్య మధ్యతరగతి వ్యక్తులే జనసేన అభ్యర్థులు కాబట్టి ప్రతిఒక్కరు వారి గెలుపుకై పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర విద్యార్థి నాయకులు మహేష్ పెంటల, నాయకులు నాంపెళ్లి విష్ణు, మారుతి, శ్రీకాంత్, అడెపు శివప్రసాద్, సాయి, రాజు, వేములవాడ నాయకులు శ్రవణ్, మధు, జనసైనికులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.