మెగా బైక్ ర్యాలీ విజయవంతం

  • విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో మెగా బైక్ ర్యాలీ

విజయనగరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో శుక్రవారం మెగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విజయనగరం వి.టీ అగ్రహారం వై జంక్షన్ దగ్గర నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీలో జనసైనికులు, నాయకులు ఉత్సాహంతో బైక్ ర్యాలీలో పాల్గొని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని నినాదాలతో ఈ మెగా బైక్ ర్యాలీ విజయవంతంగా జరిగింది. కార్యక్రమంలో నియోజవర్గం నాయకులు, మండల నాయకులు, సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.