జనసేన పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపార వేత్త నాగలపాటి సుధాకర్ రాజు

నగరి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలకు ఆకర్షితుడై మంగళవారం నగరి నియోజకవర్గం ఇన్చార్జి మెరుపుల మహేష్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరి ప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుధాకర్ రాజు మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూర్ జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కటికం నాగార్జున తదితరులు పాల్గొన్నారు.