మత్స్యకార మహిళల కోసం మెగా హెల్త్ క్యాంప్

వైజాగ్: అడ్వకేట్ జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ వై.దొరబాబు ఆధ్వర్యంలో స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సంస్థ అక్టోబర్ 2వ తేదీ వైజాగ్ యం.వి.పి.కాలనీలో ఆళ్వార్ దాస్ పబ్లిక్ స్కూల్ లో మత్స్యకార మహిళల కోసం విజయవంతంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం కు చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. వీరిలో డా.పి.వి.సుధాకర్, డా.సి.విజయ కుమార్, డా.ఉదయ్ శంకర్, డా.సుబ్రహ్మణ్యం. డా.సుధాపద్మశ్రీ పాల్గొని వారి విశిష్ట సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి బయోఫోర్ ఇండియా ఫార్మా లిమిటెడ్ ఛైర్మన్ రంగిశెట్టి జగదీష్ బాబు, వైజాగ్ సీ పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రాగం కిషోర్, ఆళ్వార్ దాస్ పబ్లిక్ స్కూల్ అధినేత విజయరవీంద్ర, ప్రవీర్ ఫార్మా అధినేత యం.గోపికృష్ణ, హెలిక్స్ హెల్త్ కేర్ అధినేత జోగింద్రనాధ్ సాయి, శ్రీ విశ్వ విద్యాసంస్థల అధినేత కె.ధర్మరాజు, సినర్జీ షిప్పింగ్ అధినేత యం.వేణు , ఫోరం ఆఫ్ ట్రెడిషనల్ ఫిషర్ మెన్ అసోసియేషన్ నాయకులు చంద్రమౌళి, జి.వి.సుబ్బారావు తమ సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి కె.ఎన్.కుమార్ (ఐ ఏ స్), శ్రీ పి.వి.రావు (ఐ ఆర్ ఎస్), మెండు చక్రపాణి, య(ఐ ఆర్ టి ఎస్), ఆకుల చంద్రశేఖర్, ఛార్టర్డ్ ఎకౌంటెంట్, నేవల్ రేర్ అడ్మిరల్ రత్నం శ్రీనివాస్, కస్టమ్స్ సూపరింటెండెంట్ నరసింహారావు, కీర్తి రామకృష్ణ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అడ్వకేట్ దొరబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పెద్దలకు, ముఖ్య అతిథులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పడాల శేఖర్ కు , ఆప్ సబ్ కి ఆవాజ్ సంస్థ సభ్యులకు మరియు ఆత్మీయ సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథులు కె.ఎన్.కుమార్, పి.వి.రావు, చంద్రమౌళి మాట్లాడుతూ ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని మా నుండి సంపూర్ణ సహాయ సహకారాలు అందచేస్తామని తెలియజేశారు.