కడపలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు

కడప: నగరంలో శుక్రవారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పండ్రా రంజిత్ కుమార్ ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా మొదట కడప నగరంలోని రాజా థియేటర్ నందు బాణసంచా పేలుస్తూ బ్యాండ్ బాజాలతో పండ్రా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో మెగా అభిమానుల సమక్షంలో భారీ కేక్ కటింగ్ చేసి అభిమానులకు థియేటర్ సిబ్బందికి పంచిపెట్టారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం పక్కన ఉన్న ప్రేమాలయ వృద్ధాశ్రమంలో అబ్బన్న రాజగోపాల్ ఆధ్వర్యంలో నిరుపేద అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ దుర్గా సంస్థల అధినేత శ్రీ విజయదుర్గాదేవి ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్ పాల్గొని ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వరుణ్ తేజ్ పుట్టినరోజును పురస్కరించుకొని కడప నగరంలో ఘనంగా వేడుకలను నిర్వహించడం అందులో భాగంగా ప్రేమాలయ నిరాశ్రయుల ఆశ్రమంలో ఈ నిరుపేద అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, వీళ్ళ మధ్యలో వరుణ్ తేజ్ పుట్టినరోజు ఘనంగా జరపడం అభినందనీయం పెద్దనాన్న చిరంజీవి చిన్నాన్న పవన్ కళ్యాణ్ వాళ్ల అడుగుజాడల్లో నడుస్తూ మరిన్ని మంచి చిత్రాలలో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టిన కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు రంజిత్ కుమార్ మరియు వారి బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలు నాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, రాజశేఖర్, విగ్నేష్, మౌలాలి, సాయి కృష్ణ, రూప్, రామకృష్ణ, దినేష్, వెంకటేష్, ముని, తదితరులు పాల్గొన్నారు.