కరోనాకి భయపడని మెగాడాటర్

త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది మెగాడాటర్ నిహారిక. ఇటీవలే టెకీ చైతన్యతో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి విధితమే. కాబోయే జంట ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక నిహారిక ఇటీవల లుక్ ఛేంజ్ కోసం జిమ్ కి వెళుతూ వర్కవుట్ లు చేస్తోందట. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ప్రతిదీ రీ ఓపెన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిమ్ లు తిరిగి ఓపెన్ అయ్యాయి. అయినా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదన్న భయంతో సెలబ్రిటీలు మాత్రం బయటికి రావడానికి ఆసక్తిని చూపించడం లేదు. కానీ మెగా డాటర్ కొణిదెల నిహారిక మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. జిమ్ లో సందడి చేస్తోంది. సెలబ్రిటీలు జిమ్ కి రావడానికి భయపడుతున్నా నిహారిక మాత్రం వర్కవుట్ లు ఆపడం లేదు. వరుడు చైతన్య ఆరడుగుల అందగాడు పైగా తీరైన రూపంతో అలరిస్తున్నాడు. అతడితో నిహారిక జోడీ కుదిరింది. ఎంగేజ్ మెంట్ ఫోటోలు చూశాక అతడు హీరో అవుతాడని జోస్యం చెప్పింది మీడియా. ఇక ఈ చూడముచ్చటైన జంట పెళ్లి డిసెంబర్ లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో నిహారిక పెళ్లి కూతురు లుక్ లో మరింతగా మెరిసిపోవడానికి సర్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే క్రైసిస్ కి అదరక బెదరక జిమ్ లో వర్కవుట్ లు చేస్తోంది. తాజాగా జిమ్ లో లావణ్య త్రిపాఠి జిమ్ ట్రైనర్ తో కలిసి ఫొటోలకి పోజులిచ్చింది. ఆ ఫోటోల్ని అభిమానుల కోసం షేర్ చేసింది. బ్లాక్ స్కర్ట్ లో నిహారిక వర్కవుట్లు చేస్తున్న ఫొటోలు ఇన్ స్టాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత నిహారిక నటిస్తుందా లేదా? అన్నదానిపై మునుముందు క్లారిటీ వస్తుందేమో!