వనపర్తిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

  • ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పాకెట్స్ అందజేత
  • మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వాన్స్ గా కేక్ కటింగ్ జరిపి మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

వనపర్తి నియోజకవర్గం: వనపర్తి పట్టణ కేంద్రంలో సోమవారం మెగాస్టార్ చిరంజీవి 68వ పుట్టినరోజు వేడుకలు మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ రామ థియేటర్ దగ్గర ఒకరోజు ముందుగా అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలుపుతూ ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించుకున్నారు. తదనంతరం బర్త్ డే సెలబ్రేషన్స్ సేవా కార్యక్రమంలో భాగంగా అక్కడి నుంచి వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పాకెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగా అభిమాన సంఘం జిల్లా నాయకులు, జనసేన కోఆర్డినేటర్ ముకుంద నాయుడు మట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారే మాకు సేవా దృక్పథంలో ఆదర్శమని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ గారితో సహా మెగా కుటుంబ హీరోలు అందరూ, అభిమానులూ నడుస్తున్నారనీ తెలిపారు. స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నె తెచ్చిన మెగాస్టార్ సినీ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. తెలుగింటి అభిమాన నటుడిగా ప్రజాల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మా అన్నయ్య పద్మభూషణ్ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఆనందాన్ని వ్యక్తపరిచారు. మెగా హీరోలు చూపిన సేవా మార్గంలో తాము ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు కంప్యూటర్ భాస్కర్, జిల్లా అధ్యక్షులు నాగరాజు, జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు, శ్రీరామ థియోటర్ మేనేజర్ శేఖర్, అభిమాన సంఘం నాయకులు రాజు ఆర్ట్స్, కరుణాకర్, ప్రభు, వెంకటయ్య తదితరులు మెగా అభిమానులు పాల్గొన్నారు.